ప్రతీరేయి
ప్రతీరేయి
ప్రతీ రేయి నువ్వోస్తావు
జ్ఞాపకాల తక్కిడ నిండా
కన్నీటిని కానుక చేస్తావు
తొలి వేకువజామున
మేలు కొల్పి కనులు తెరచిన
మాయమవుతావు
ప్రేమంటే అందరూ
రెండు శరీరాలు
ఇరువురి హృదయాలు
అంటారు కానీ
అనురాగం. అని ఎవరూ చెప్పరు
నా అనురాగం ఒక కెరటములా
నిన్ను తాకి వెనుతిరిగి పోయివుండవచ్చు
నీ అనురాగకెరటములు ఆకాశముల నన్ను చేరకపోవచ్చు ఓ తొలి సంధ్యల చక్కని అనుభూతిని ఇచ్చింది అనురాగం పంచింది
మన దేహాలతో
సంబంధం లేని మన పరిచయం
సూన్యంలో సంచరిస్తూ తలపులలో
నిద్రపోతుంటాయి బంగారం ఆ గోదారమ్మకు మాటిచ్చాను మలినంకానీ జీవంతో నేను
నీతోడవుతానని వెన్నలమ్మకు మాటిచ్చాను
నీ వెలుగు నాకు అవసరం వస్తావా ప్రతీ రేయి నీ పలకరింపు నాకు అందిస్తే నిద్దురోతానని
మాటఅయితే ఇచ్చాను
ఇప్పుడు చీకటిలో ప్రతీ రోజు వేచి చూస్తుంటాను ఏ మబ్బుల మాటున ఉన్నావో ఎప్పుడొస్తావో అని ఎదురుచూస్తూ ఓ సారి నిరాశ ఓసారి ఎడబాటు ఓ సారికన్నుల్లో వెలుగు వెరసి
కన్నులు చీకటిలోనే ఉండాలంటున్నాయి వెలుగులోకి రావడం లేదు చూడలేకపోతున్నాయ

