ప్రతి పేజీ
ప్రతి పేజీ
ప్రతి పేజీలో నిన్నే అలంకరిస్తున్న..
..నీకందే టట్టుగా...!
అన్నిట్లో నిన్నే ఉంచేస్తున్నా......
నీకు తెలిసే టట్టుగా...!
చెప్పకుండా ఆగిపోతున్న
నువర్థం చేసుకుంటావనుకునే టట్టుగా...!
మాటి ,మాటికీ నా ఊపిరినే
అక్షరమై అందిస్తున్న
నువ్వు తీసుకునే టట్టుగా...!
నీపై నా ఆరాధన అని
చెప్పాలనిపించే టట్టుగా.....!!

