ప్రతి నిమిషం
ప్రతి నిమిషం
నీతోనే కాలమంత గడపాలని ఉన్నదిలే
ప్రతి నిమిషం నీ ఊహల తేలాలని ఉన్నదిలే "
ముషాయిరా నిషా కన్నమత్తు ఏమి కవిత్వాన..
ఓ చెలియా నీ తలపులలో మునగాలని ఉన్నదిలే..!!
ఎన్నాళ్ళకు వచ్చావోయ్ ఈడూరీ స్వాగతమిదె..
మీ షేరుల మాధురినే గ్రోలాలని ఉన్నదిలే..!!
ఎక్కడ మరి ఓ చెలియా నీ అడుగుల సవ్వడులు..
ఆ మువ్వల నాదంలో మురవాలని ఉన్నదిలే..!!
పలుకు తేనే లోలికించే నీ మౌనం నాకిష్టం..
ఆ అక్షయ పాత్ర నిధిని పొందాలని ఉన్నదిలే..!!
నీ లీలలు..చూసేందుకు రెండు కళ్ళు చాలవులే..
కన్నయ్యా.. నీ చెంతకు చేరాలని ఉన్నదిలే..!!
బుల్లెట్లవి ఎందుకులే శ్రీనివాస వినవయ్యా..
అక్షరాల బొబ్బట్లే కావాలని ఉన్నదిలే..!!
మజా మజా షేరులతో హుషారులే పంచేస్తూ
పని అలసట అందరిదీ తీర్చాలని ఉన్నదిలే..!!
మీ హాస్యపు బుల్లెట్లవి నవ్వు పూలు నింపేవే..
ఈడూరీ వర్షిస్తే తడవాలని ఉన్నదిలే..!!
మోసేవో భారమేను..ఓ సఖుడా..కలనైనా..
నీ తీయని తలపులలో ఉండాలని ఉన్నదిలే..!!
పరవశాల జల్లులలో ముంచెత్తే చెలికాడా..
నీ అనునయ నయనాల్లో నిలవాలని ఉన్నదిలే..!!
నీ తియ్యని కోపానికి..చెలుని మనసు బలిచేయకు..
నీ అలుకల నీలి మబ్బు మీటాలని ఉన్నదిలే..!!
చదువు మాట దేవుడెరుగు స్కూలు బాగు బరువు చూడు..
ఈ గాడిద బతుకు బాట మారాలని ఉన్నదిలే..!!
ఆర్యులార..మంత్రులార ఈ చదువుల తీరిదేల..
బహు చక్కని విధమేదో చెప్పాలని ఉన్నదిలే..!!
జన్మలెన్ని ఎత్తానో ప్రేయసిగా నిను పొందగ..
నీ కన్నుల నను చూస్తూ మరవాలని ఉన్నదిలే..!!
నీ అనుగ్రహ మధువు ముందు ఏ తేనియ సరి తూగును..
నీ చూపుల కౌగిలిలో తడవాలని ఉన్నదిలే..!!
జ్యోతమ్మా నీ బిడ్డలు మురియు తీరు నచ్చిందా..
నీ చూపుల కాంతులలో నిలవాలని ఉన్నదిలే..!!
బాహుబలి చూడాలను కోరిక సరె 'శ్రీనివాస..!'
మీ బలము టికెట్ క్యూలో చూడాలని ఉన్నదిలే..!!
ఎంత పొద్దు పోయిందో పని గొడవలొ ఓ చెలియా..
వేవేగమె నీ ఒడిలో వాలాలని ఉన్నదిలే.. !!
నీ గళమున మారుమ్రోగు గీతమునే అవగలనా..
మరపురాని ఓ గజల్ గ మిగలాలని ఉన్నదిలే..!!
మాటాడదు చందమామ..వెన్నెలలే కురియుచుండు..
నీ నవ్వుల ఆ వెన్నెల పొందాలని ఉన్నదిలే..!!
వ్రాస్తున్నా నీ దయతో మది నిండిన కోకిలమా..
నీ గానమె అక్షరాల పొదగాలని ఉన్నదిలే..!!
ఏదడిగిన అది ఇచ్చే నెచ్చెలివే ఓ కోమలి..
మనసులోనె తనివి తీర పొగడాలని ఉన్నదిలే..!!
చదవాలని ఉందంటూ నిదురలోనె వ్రాస్తారే..!
వహ్వారే ఆచార్యా ..మెచ్చాలని ఉన్నదిలే..!!
అట్లకాడ పట్ల మీదు ఎరుక అమోఘమే 'శ్రీనివాస'..
చమత్కార సాగరమే.. కావాలని ఉన్నదిలే..!!
నీలి మబ్బు తెరలలోన..దూబూచులు నీకేలా..?!
నా హృదయపు కోవెలలో నిలపాలని ఉన్నదిలే..!!
దొంగాటలు చాలించర ఓ అల్లరి కన్నయ్యా..
అనుక్షణం నిన్నే మది కొలవాలని ఉన్నదిలే..!!
ఏ దారము ఎందుకయా నా వలపులు అందివ్వగ..
నువు మెచ్చే మందారము కావాలని ఉన్నదిలే..!!
పారిజాత మెక్కడిదో..బ్రహ్మ కమల మెక్కడిదో..?!
నీ పదాల గరికనైతె..అవ్వాలని ఉన్నదిలే..!!
నీ చూపుల పూల దారి సాగిపోవు భాగ్యమిదే..
ఆ కాంతుల మహిమలన్ని పట్టాలని ఉన్నదిలే..!!
అడుగు లోన అడుగు వేసి అల్లుకునే ప్రియ సరసీ..
నీ సిగ్గుల జల్లు చూసి నవ్వాలని ఉన్నదిలే..!!
వెను తిరుగక వయారాల వాల్జడ నే విసిరేవే..
వసంతమై నీ ఎదలో నిండాలని ఉన్నదిలే..!!
నా మనస్సు తోటలోన వికసించిన విరులెన్నో..!!
పువ్వు పువ్వు నీ పూజకు ఇవ్వాలని ఉన్నదిలే..!!
నీ నవ్వుల మల్లియలో విరజాజులొ కురిసేనే..
ఒకటొకటిగ నీ పైనే రువ్వాలని ఉన్నదిలే..!!
అనుబంధపు దారానికి అల్లుకున్న సుమాలెన్నొ..
పరిమళించు దారులలో నడవాలని ఉన్నదిలే..!!
అల్లరసలు తెలియనిదే కాలమంటె నమ్మలేరు..
క్షణం ఒడిని కోకిలలా బ్రతకాలని ఉన్నదిలే..!!
నా చేయిని వీడకుండ వెన్నంటిన ఓ చెలియా..
నీ వెంటే లోకాలను తిరగాలని ఉన్నదిలే..!!
చెలికాడా.. నెలరేడా.. నీ ప్రేమకు వందనాలు..
కలనైనా నిను వీడక వెలగాలని ఉన్నదిలే..!!
నా కలమున విరియుచున్న అక్షరాగ్ని పూలు చూడు..
నీ లోపలి కల్మషాన్ని కాల్చాలని ఉన్నదిలే..!!

