ప్రణయసాగరం
ప్రణయసాగరం


ప౹౹ ఎవరో వస్తారని ఎవరో వస్తారని ఎదురుచూపులే తనెవరో తనెవరో వచ్చి గుచ్చినే ఎదనుతూపులే ౹2౹
చ౹౹ ఏవమ్మా ఏవమ్మా రాత్రల్లా దాచిన ఆ అందాలూ ఓయమ్మో ఇంతందం కోసమేగా మరి పందాలూ ౹2౹
దరిచేరిన దరహాసమే నిదురే రానీదుగా నిలిపేసి ఇద్ధరి మనసులలో ఇసుమంత ఖాళీలేక కలిపేసి ౹ప౹
చ౹౹ వలపు వాంగ్మూలం వద్దనకే తెచ్చెనే పెద్ధ లహరి తలపు తన్మయం తనువునే కమ్మే కొత్త లాహిరి ౹2౹
ఆగలేని ఆ మైకం అదుపుతప్పునని అదో చింత వేగలేని ఎడద ఎరపు మరచి అలా పాడినే వంత ౹ప౹
చ౹౹ దాచేసిన అందాలకు దాస్యం ఇక తొలగించవమ్మ దోచేసిన హృదిని దొరకబుచ్చి దారిమళ్ళించకమ్మ ౹2౹
ప్రణయసాగరం పల్లవించనీ పరిధులన్నీ దాటించి ప్రణుతి రాగం పల్లవిగ ఆలపించనీ మది మీటించి ౹ప౹