ప్రణయ కావ్యం
ప్రణయ కావ్యం
ప్రణయ కావ్యం
నీవు నేనుగా
నేను నీవుగా
వీడని బంధంగా
సరాగాల పంటగా
అరమరికలు లేని జంటగా
అనునిత్యం అన్యోనంగా
ప్రేమ పరిమళం వెదజల్లగా
పలికెను గుండె లయగా
మల్లెతీగలా అల్లుకుంది పదిలంగా
మురిపించింది మమతానురాగంగా
ప్రణయ కావ్యమై మధురంగా
దైవం ఇచ్చింది మనకు వరంగా
కొనసాగనీ మన ఈ అనుబంధం దివ్యానుబంధంగా !!

