ప్రకృతి ప్రభాతం
ప్రకృతి ప్రభాతం
చిటపట చినుకులు తడిపే సూర్యుని
తొలితొలి వెలుగులు చేరెను పుడమిని
బిరబిర పరుగుల కాలపు నడకని
గమనించినదో చిక్కని నిశి అని
తొలగిన తామసమే తామరగా విరిసేనని
తడితడి పుత్తడి నేలపై అడుగుని
ముద్రించింది తొలకరి ఉదయమని
ఆస్వాదించిన మనసును కనుగొని
మదికి ఆ ఆహ్లాదమే కానుక అనుకొని
ఇచ్చిందేమో ప్రకృతి ప్రభాత వేళలని

