STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియతమా...‌

ప్రియతమా...‌

1 min
225

కనుల నుండి నారూపం చెరపగలవ ప్రియతమా

మనసునుండి నీప్రేమను మలపగలవ ప్రియతమా


మధురమైన జ్ఞాపకాలు మనసువదిలి మనలేవుగ

కాదంటూ కన్నీటిని దాచగలవ ప్రియతమా 


పచ్చబొట్టు ప్రమాణం పచ్చనిదే పరిమళం

వెచ్చదనం వదిలివేసి వెళ్ళగలవ ప్రియతమా


దూరమెంత నడిచిననూ దారులన్నీ నావైపే

లేదంటూ నీఅలసట ఆపగలవ ప్రియతమా


కోవెలంటి నా మదిలో కొలువైనా దైవానివి

మరలివచ్చు మాటొక్కటి చెప్పగలవ ప్రియతమా!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance