STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియమార

ప్రియమార

1 min
1

ఒంటరిని కొంటెగా..అలరించు గాలి ఇది..! 

ప్రియమార మౌనముగ..భాషించు గాలి ఇది..! 


ఏపైరు పైనుండొ..వీచేను సన్నగా.. 

మనసుపడు ముచ్చటే..నేర్పించు గాలి ఇది..! 


బంగారు కిరణాల..అల్లరే మధువుగా.. 

అరకనుల వీధిలో..వడ్డించు గాలి ఇది..! 


నా చెలుని హాసమే..వీనులకు విందుగా.. 

రాగాల పల్లకిని..ఎక్కించు గాలి ఇది..! 


వాసంత పరిమళం..గంధముగ పూసెగా.. 

ఒళ్ళంత పులకింత..పండించు గాలి ఇది..! 


అపురూప పరువాల..సందడే ముద్దుగా.. 

తన కొఱకు ఎదలోన..పొంగించు గాలి ఇది..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance