ప్రియా,..
ప్రియా,..
తీరిక దొరికెనా దొరా...
గాలి మళ్లెనా ప్రియా...
మనసు కుదుటపడెనా సఖా...
హాయి పవనము వీచేను నావైపు...
మరులు గొలిపేను మది...
విరులు పూసేను చెక్కిలి...
మకరందమయ్యింది అధరం...
హరివిల్లైపోయింది మేని...
తలపుకింత తపనున్నదా...
పిలుపుకింత మాయున్నదా...
నీరాకకింత బలమున్నదా...
మన కలయికెంత వరమోకదా...

