ప్రియా
ప్రియా
తీరికేమొ చెబుతున్నది..చూడు కాస్త నాదిక్కని..!
ధనమదేమొ చెబుతున్నది..చూడకుమరి ఏవైపని..!
అలసటెంత దయాపూర్ణ..నిదురలోకి నడిపించును..
సహనమేమొ చెబుతున్నది..మనశ్శాంతి ఇస్తానని..!
జగడాలకు దిగిపోతే..ముప్పేగా ప్రాణాలకు..
స్నేహమేమొ చెబుతున్నది..చిరునవ్వై ఉందామని..!
మాటలెంత పదునుకత్తులో బాంబులొ ఏంచెప్పను..
మౌనమేమొ చెబుతున్నది..అవగాహన పెంచెదనని..!
అలజడితో ఆందోళన..ఆనందమె నీ సొంతం..
ధ్యానమేమొ చెబుతున్నది..శ్వాసధార గమనించని..!
కంటిపాప చెబుతున్నది..ఎఱుకనదిని మునగాలని..
హృదయమేమొ చెబుతున్నది..సూర్యునిలా బ్రతుకుమని..!

