ప్రియా వసంతగీతం
ప్రియా వసంతగీతం
ప్రియ వసంతగీతమా...
కుహుకుహూల రాగమా...
వన మయూర నాట్యమా...
విరబూసిన పూదోట అందమా...
ఊహలలో పలకరించిన సౌందర్యమా....
యవ్వనపు తొలకరి చినుకుల్లో
మల్లెలు పూసి
సువాసనతో మత్తెక్కించే
ఆ తరుణంలో......
నిను చూసిన ఆ క్షణంలో...
అంబరాన్ని తాకిన సంబరంలో
మదిని మైమరపించే నీ రూప లావణ్యం
చేసింది నా హృదయంపై చెదిరిపోని
ప్రేమ సంతకం...

