ప్రియా సఖి
ప్రియా సఖి
ప్రియా...
వసంతం నేనైతే కోయిల గానం నీవు...
పల్లవి నేనైతే చరణం నీవు...
నీలిమబ్బును నేనైతే ఇంద్రధనుస్సు నీవు....
వెండివెన్నెల నేనైతే చందమామ నీవు....
రారాజు నేనైతే నా హృదయ సామ్రాజ్ఞి నీవు...
కనులేమో నావి కలలన్నీ నీవి...
మనసేమో నాది తలపులేమో నీవి....
హృదయమేమో నాది స్పందన మాత్రం నీది....
తనువేమో నాది దాని తపన మాత్రం నీది..
ప్రాణమొక్కటే నాది ఈ జీవితమంతా నీది...
... సిరి ✍️❤️

