పరిమళాలు
పరిమళాలు


ప౹౹
పరిమళాలు పూసి తెచ్చానులే పరవశాలు
పరిశ్రమించి రాసి చేర్చా లేఖలోని అంశాలు ౹2౹
చ౹౹
ఎదలో ఎరుకను ఎలమే అని తెలుసుకొని
మదిలో తారాడే తన్మయమే కలిపేసుకొని ౹2౹
ఆమనిలో అందాలే అరవిందాలే చేసుకొని
ఆమెను ఆలంబనగా రాశా దరి చేర్చుకొని ౹ప౹
చ౹౹
కలని కావ్యంగా రాసుకున్నా సరిచేసుకొని
ఏకలవ్య బాణమై తగిలేల గురిచూసుకొని ౹2౹
అర్ధము చేసుకొని ఆకళీంపుతో చేర రావా
పరమార్ధమే తెలిసికొని ఆలింగనం చేరవా ౹ప౹
చ౹౹
స్మరించి విషయం విపులంగా వివరించగా
హరించ మనసూ సాంతం అవలోకించగా ౹2౹
పరవశమే పరవళ్ళతో అలా ప్రవహించగా
పరంపరగా సాగినే కోరికతోను దహించగా ౹ప౹