ప్రేయసివే
ప్రేయసివే
ప్రేమించిన ప్రేయసినే పొందలేని తనువెందుకు
ఆమెప్రాపు లేని ఈఅభాగ్యుని బ్రతుకెందుకు
నిన్ను వలచి తలచుకుంటు బాటప్రక్క పడివున్నా
ఒక్కసారి చూడరావు కలువరేకు కనులెందుకు
ఇన్నేళ్లుగ మండుతున్న గుండెసెగలు తాకలేదా
విరహాగ్నికి కరిగిపోని వెన్నలాంటి మనసేందుకు
రాళ్లు ముళ్లు గుచ్చుకునీ మూల్గుతోంది నాఒడలు
వలపుమందు పూయరావు మంచువంటి చేయెందుకు
ప్రతిరోజూ గుడికిపోయి దేవుని అర్చిస్తావూ
నాగుండెలొ ప్రేమదివ్వె పెట్టలేని పూజెందుకు

