ప్రేమపూజ !
ప్రేమపూజ !
నీవు విహారానికి యూరప్ వెళ్ళినా ,
ఇండియాను వీడి
అమెరికా పౌరసత్వానికి ఉవ్విళ్ళూరినా
నీ తలపులతోనే నాకు ప్రతిఉదయం ,
పిలుపులు చెవిలో మ్రోగుతూ
పడమట మరో ఎర్రని సంధ్యాసమయం .
నీవు రోదసీలో పయనిస్తూ
చంద్రుడిలా దూరతీరాలకేగినా ,
చుక్కల్లో ఒక చుక్కలా
మిణుకు మిణుకుమనుచున్నా
పగలంతా నీకోసమే ఎదురుచూపులు .
రాత్రంతా చల్లనివెన్నెలలో
తడవాలని విరహజ్వాలలు .
ఎక్కడ నీవున్నా నీ కనుపాపల్లో
నన్ను రోజుకోసారైనా కనపడనీవా ?
మదిలో దాచుకుని
నీ ఆనందానుభూతుల్లో భాగస్వామిని కానీవా ?
స్వయంగా ఈ ప్రేమికునికై విచ్చేసి ,
అనుక్షణం నిన్ను నీవు నా ముందే ఉంచేసి
కలకాని నీ నవ్వులతో నా హృదయంలో
మమతలు పూయించవా ?
ప్రత్యక్షదేవతవై నిత్యం ప్రేమపూజలందుకోవా ?

