STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ప్రేమంచే నీ రాధ

ప్రేమంచే నీ రాధ

1 min
2

నువు దరి లేని క్షణములో నే శిశిరమౌతా...

నువ్వొచ్చాకే నే వసంతమొచ్చిన పూల తరువునౌతా...

నువు కానరాని సమయంలో కన్నీటి సంద్రమౌతా...

నీతీయని పిలుపుతో నే పూల తేరు నౌతా..

వెన్నెల కురిపించే నీ చూపులకై నే చకోరమౌతా...

నిరీక్షించు సమయంలో నీ గుడివాకిట దీపమౌతా...

నాప్రాణం కొడగట్టే లోపు నాదరికి ఒక్కసారి వస్తే అఖండ జ్యోతినవుతా..

నీసన్నిధి లో నే ప్రేమ పులకింత నౌతా..

నీమీద ఆరాధన తో నువు మీటే మౌన వీణనౌతా..

నీవేణుగాన మాధురిలో తలమునకలౌతా...

ఈలోకంతో ఏ బంధమూ లేని నిను మాత్రమే ప్రేమించే నీ రాధ నౌతా..



Rate this content
Log in

Similar telugu poem from Romance