ప్రేమకు రూపం
ప్రేమకు రూపం
ప్రేమకు రూపం వెతకగబోతే..నీవై దొరికావు..!
దేవత నీవని చేరగవస్తే..శిలగా మారావు..!
ఆశల తీరం ఉన్నదెచ్చటో..బాధకు అంతేది..
పాటల పక్షిగ మనసే ఎగిరితె..ప్రాణం పోశావు..!
విరహపు కడలిని ఈదేటెట్లా..చీకటి రాత్రిలో..
బ్రతుకుకు అర్థం చెప్పమంటే..మౌనం దాల్చావు..!
తరగని వన్నెల వెన్నెలగనివే..నీవని తలచితిని..
నవ్వుల పువ్వులు అరెరే చక్కని..చితిగా పేర్చావు..!
మోహన రాగం హృదినే మీటగ..కన్నులు తెరిచాను..
శిశిరంలోనూ కోకిల గానం..విందులు చేశావు..!
జన్మల పుణ్యం ఎంతగ ఉందో..వింతగ తోచింది..
బొమ్మకుబొరుసుకు తేడా ఏమీ..లేదని చాటావు..!

