ప్రేమకెంత బలమో
ప్రేమకెంత బలమో
ప్రతి నిముషం పెనుతుఫానులాగ ఉంది..!.
మనసేమో మూగమబ్బులాగ ఉంది..!
కనలేను కలలింక..కన్నీరిలా ఇంక..
మసకెందుకో తీపితోడులాగ ఉంది..!
ప్రేమకెంత బలమో..వేదనలో నిలుపగా..
పగకెంత ప్రేమో..కడలిపొంగులాగ ఉంది..!
మన నడుమ దూరం తప్పుకోని అతిథి..
విరహమే ఈ జన్మకు మధువులాగ ఉంది..!
చిరుగాలే సుడిగాలిని తలపించేనా ఏమో..
మధుమాసమే ఇపుడు మోడులాగ ఉంది..!

