STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

ప్రేమిస్తున్నా !

ప్రేమిస్తున్నా !

1 min
286


నిన్ను చూసినరోజు నుంచి ఊహలేలనో

విడువక ఊరించి మురిపించుచున్నవి .

నీ ప్రేమను కోరి , అందులో ఆడిపాడమని

ఎంతగానో నన్ను ఉర్రూతలూగిస్తున్నవి .


నీవు కొమ్మపై పూసి , ఆకులచాటున విరిసి

నాలోని విహారిని స్వాగతించే సంపెంగవు .

ప్రేమలోని అందాన్ని నీ కోమల వదనంతో

కన్నుల పండువగా నాకోసం ఆవిష్కరించేవు .


నా చూపుల వలలో చిక్కి , ఆ తాకిడిగాలికి

ఊగుతూ ఒయ్యారాన్ని ఓ గువ్వలా ఒలికించేవు .

ప్రేమలోని ఆకర్షణను కలలోనూ తలచేలా

అనుక్షణమూ అహో అనేలా పదింతలు చేసేవు .


వర్షపు చినుకులకు తనువంతా తడిసి ముద్దై

పొంగిపొరలే సౌందర్యాలను విందు చేసేవు .

స్పర్శలో తపించే లయను , తియ్యని ముద్దులో

వర్ణనకు అందని వెచ్చని హాయిని కలిగించేవు .


గులాబీరంగు అంబరాల్లో నీవు ఒదిగితే

నాకు రోజంతా మైమరపించే గొప్ప అనుభూతే .

సంధ్యాసమీరంలో జంటగా షికారు చేస్తే

రెక్కలగుర్రంపై మబ్బుల్లో తేలే మధుర ఊహే !




Rate this content
Log in

Similar telugu poem from Romance