Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Babu Kommineni

Drama

4.8  

Ramesh Babu Kommineni

Drama

ప్రేమికుల రోజు

ప్రేమికుల రోజు

1 min
450



ప౹౹

ప్రపంచ ప్రేమికులారా కదలి రండి రండి

ప్రచండ ప్రేమనూ ముందుగనే చాటండి ౹2౹


చ౹౹

పవిత్ర ప్రేమను అందరూ స్మరించే రోజు

చరిత్ర సృష్టించే ధరిత్రిలో ఓ ప్రేమ రాజు ౹2౹

బడాయి ప్రేమే వద్దుగ బహిష్కరించండి

లడాయి లేకను బాధ్యతగా ప్రేమించండి ౹2౹


చ౹౹

గులాబీలు వాడినా గుబాళింపులే నిండు

ప్రేమలు పాతబడినా పరిమళంతో పండు ౹2౹

అవునన్నా కాదన్నా వలపుదేగా వసంతం

ఎవరేమన్నా గెలిచి తీరునులే ప్రేమపంతం ౹ప౹


చ౹౹

వర్ధమాన ప్రేమికులారా వర్ధిల్లండీ ప్రేమతో

ప్రవర్ధమానమై పరిఢవించనీ సరి లేమతో ౹2౹

వాలంటైన్స్ డేనూ జరపండి వాటంగాను

వాలంటీర్సై ప్రసరించై ప్రేమకవాటంగాను ౹ప౹



Rate this content
Log in