ప్రేమబాకు
ప్రేమబాకు
ప్రేమబాకు గుచ్చుకునీ గాయపడ్డ ముసాఫిర్ని
ఆశకోట మెట్లపైన జారిపడ్డ ముసాఫిర్ని
తోడువచ్చి చేరదీసి చేతిలోన బాసచేసి
నమ్మకాలు వమ్ముచేస్తె దగాపడ్డ ముసాఫిర్ని
అనుకున్నది సాధించే వ్యక్తిత్వము నాకున్నది
మనస్సాక్షి సంపదలతొ బ్రతికిచెడ్డ ముసాఫిర్ని
ముందడుగు వేయొద్దని హృదయమెంతగ చెప్పినా
మాటవినని మనసుతోనె మాటపడ్డ ముసాఫిర్ని
ఏపుట్టలొ పాముందో ఎవరికెరుక ఓ
ఆమెఅంటె పిచ్చిగనుక మనసుపడ్డ ముసాఫిర్ని
