ప్రేమా
ప్రేమా
చెరిగిపోని ముద్ర ఒకటి..వేసినావు ప్రేమా..!
మరువలేని పాట ఒకటి..నేర్పినావు ప్రేమా..!
నీతోనే ఉండాలను..కోరికెంత మధురం..
పరమళాల బాట ఒకటి..చూపినావు ప్రేమా..!
పెదవివిప్పి మాటాడక..వర్షింతువు ఏమది..
చూపులింట తోట ఒకటి..పెంచినావు ప్రేమా..!
అనురాగం ఆత్మీయత..ఉన్నాయా విడిగా..
నాది అనే మాట ఒకటి..కాల్చినావు ప్రేమా..!
చుట్టమెవరు పక్కమెవరు..మేఘాలకు తెలుసా..
సమభావన ధార ఒకటి..నింపినావు ప్రేమా..!

