ప్రేమ
ప్రేమ
ఉప్పొంగే జీవనదిలొ ఎక్కడుంది ప్రేమ
ఫలియించని తలపువనిలొ ఎక్కడుంది ప్రేమ
సర్వస్వం నీవేయని ఉసురుతీయు ప్రియుడు
చెలియపైన ప్రియుని మదిలొ ఎక్కడుంది ప్రేమ
ప్రజలసొమ్ము దోచుకునే ధనమదాంధుడతడు
తలనిమిరిన నాయకునిలొ ఎక్కడుంది ప్రేమ
సౌకుమారి పూలసొగసు తేటికప్పజెపితె
తననుకనిన తీవెమదిలొ ఎక్కడుంది ప్రేమ
చెమ్మచేర్చి విత్తనాలు మొలకలెత్తె చూడు
పొంగుకొచ్చె వరదసుడిలొ ఎక్కడుంది ప్రేమ

