STORYMIRROR

శ్రీకాంత్ బెందాళం

Romance

4  

శ్రీకాంత్ బెందాళం

Romance

ప్రేమ..❤️

ప్రేమ..❤️

1 min
386

తను అడిగింది... 


ఒకటిగా ఉండేదేంటి అని...

"ప్రపంచం"లాంటి నువ్వే అని చెప్పాను నేను... 


రెండుగా గుర్తింపు ఏంటని ప్రశ్నించింది తను... 

"సూర్యచంద్రుల" రూపమైన నీ కళ్ళు అని చెప్పాను... 


మూడుగా మారిపోయినవి ఏంటని అడిగింది తను.. 

మూడు ముళ్ల బంధాన్ని ముచ్చటగా కాపాడే "మూడు కాలాలు" అని చెప్పాను నేను... 


నాలుగు అనే పదానికి అర్థం ఏంటని అడిగింది తను... 

"నాలుగు వేదాల"తో కూడిన అద్భుతం నీవని చెప్పాను నేను...


ఐదుగా అందరిని అలరించేవి ఎవని అడిగింది తను... 

"పంచ భూతాల"లో కొలువైన నీ రూపమని చెప్పాను నేను.. 


ఆరుగా మారి అవసరమైనవి ఏంటని ఆలోచింపజేసింది తను...

నువ్వు ఇచ్చే ముద్దు లాగా మధురంగా ఉండే "రుచులు"అని చెప్పాను నేను... 


ఏడుగా ఉండి అందాన్ని తలపించేవి ఏంటని అడిగింది తను... 

"హరివిల్లు" లోని వర్ణాల వంటి నీ సొగసని చెప్పాను నేను...


ఎనిమిదిగా ఉండే గుర్తులు ఏవని అడిగింది తను... 

అష్ట దిక్కులుగా మారిన నీ చెలిమి అని చెప్పాను నేను... 


తొమ్మిదిగా నిలిచిపోయిన అంశమేదని అడిగింది తను... 

నవగ్రహాల దైవ రూపం నీవన్నాను నేను... 


పదిగా గుర్తించడబడిన రూపమేంటని అడిగింది తను... 

దశావతార రూపాల నీ ప్రేమని చెప్పాను నేను... 


నాపైన నీకు ఎందుకు ఆ అభిప్రాయం కలిగింది అని అడిగింది తను... 

మౌనంగా ఉండిపోయాను నేను... 


నేనంటే నీకు యెంత ఇష్టం అని అడిగింది తను...

మౌనంగా చూస్తుండి పోయాను నేను... 


నేనంటే నీకు ప్రాణమని చెప్పొచ్చుగా అన్నది తను...


నేను - నువ్వంటే నా ప్రాణమని చెప్పొచ్చు కానీ 

నీపైన నాకున్న ప్రేమ ముందు నా ప్రాణం చాలా చిన్నదని నిన్ను చూస్తూ ఉండిపోయాను ప్రియతమా..!!


శ్రీ..✍️ 


Rate this content
Log in

Similar telugu poem from Romance