ప్రేమ
ప్రేమ
మధుర తరమగు భావనల్లే ఎదురు పడగా మరచిపోయెను.
కాలమహిమకు కదలిపోతూ ప్రేమ తెలుపగ. వదలి పోయెను
నీలిమబ్బులొ తొంగిచూసే జాబిలమ్మ తొ చెప్పుకున్నా
కరుణచూపుతు నీరు కార్చుతు , మబ్బు చాటుకు మరలి పోయెను.
మదిని విరహపు జ్వాల లెన్నో అగ్గిరేపగ వడలిపోతిని..
మలయపవనం హాయిగొలుపగ గతపు గురుతులు చెదరి పోయెను..
ఆశలన్నీ ఆవిరవుతూ మనసుకెంతో చింత చేర్చెను.
భాష తెలియని ఊసులెన్నో చేర్చి తానుగ తరలిపోయెను
