STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మధ్యతరగతి జీవితం

మధ్యతరగతి జీవితం

1 min
4



బాధ్యతల్ని భుజాన వేసుకొని భయాలుదేరుతాడు.
రోజులు గడవడం కోసం యుద్ధమే చేస్తాడు.
ఎన్నో ఆటంకాలు అడ్డుపడతాయి.
మరెన్నో సమస్యలు ప్రతి రోజు ఇంటి తలుపులు 
తడుతూనే ఉన్నాయి.

ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ.
పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు.
పిల్లల స్కూల్ ఫీజులు.
ఆరోగ్యాలు బాగోలేక హాస్పిటల్ ఖర్చు.
మంచికి -చెడుకి పండుగలకు పబ్బలకు.

ఏది కొన్నా బగ్గుమానే ధరలు.
రాను రాను మధ్య తరగతి జీవితాల్లో 
సంతోషాలు లేకుండ పోతున్నాయి.
ఏం చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నాడు.

రాత్రులు పడుకుంటే ఆలోచనలతో నిద్ర రాక 
గడిచిపోయిన ఉదయాలెన్నో.
జీవితాలు మారుతాయనే ఆశ.
బ్రతుకు బండి లాగలేక భుజాలు బరువెక్కిపోతున్నాయి.
ఎన్ని బరువులు మోస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి 
అక్కడే అనట్లుగా ఊడిపోతుంది మధ్య తరగతి జీవితాలు..

                                          


Rate this content
Log in

Similar telugu poem from Classics