గుండెచాటున ఉన్న చెలియే..మౌననదిగా మారిపోయెను..!
అసలు ప్రేమయె పసిడివానై..మదిని ఖాళీ చేసిపోయెను..!
చేదునిజమేం లేదుగానీ..కఠినవాస్తవ మెంతతియ్యన..
కథలు చెబుతూ పాలు మీగడ..వెన్నలెన్నో పంచిపోయెను..!
చెప్పుకోగా ఉన్నదెవరట..నాటకానికి సాక్షి కాగా..
చెలిమిమంత్రం చెవినిచెప్పక..చూపుతోటే కురిసిపోయెను..!
లాభమేదో నష్టమేదో..లెక్క పత్రం ఎట్టులుండునొ..
కర్మలన్నీ రాలిపోగా..కాలచక్రం తిప్పిపోయెను..!
శ్వాసవీణియ శృతినిచూసే..చేతులేవో కానరావే..
తేనె కన్నా మధురమైనది..ప్రాణధారగ మలచిపోయెను..!
నన్ను'నేను'గ తెలుసుకోగా..పూలదారిని పరచెతానే..
భ్రమావరణం వీడిపోగా..చిలిపిమెఱుపై నవ్విపోయెను..!