గల్ఫ్ ఎండలు
గల్ఫ్ ఎండలు
మండే అగ్ని గోళాలు.
దేహాన్ని స్వేదం తో తడిపేస్తున్నాయి.
ఎటు చూసినా ఉక్కపోతాల హోరులు.
వేడి గాలుల మోతలు.
ఒంట్లో శక్తి ఉండాదు.
తడి ఆరనీ గొంతులు.
అడుగులు సైతం కదలనివ్వదు.
లోలోపల ఉడికిపోతాం ఆ వేడి కి.
దేహాన్ని నీరసం గా మార్చేస్తుంది.
ఈ వేసవి లో పని చికాకులు తెప్పిస్తుంది.
ఒంట్లో శక్తి నీ కోల్పోతాం.
ఆ వేడి తట్టుకోలేక ఎండ దెబ్బలకు గురవుతాం.
తీరిపోని బాధలు ఆ గల్ఫ్ జీవితాలు.
అన్నింటిని తట్టుకొని నిబబడుతాం.
కుటుంబల బాధ్యత కోసం.
దాచుకుంటాం అన్ని మది లోనే.
మా ప్రయాణం సుదీర్ఘం ఏది వచ్చిన ఎదుర్కోవాలి
గుండె నిబ్బరం తోనే.
గడిచిపోతాయి ఈ ఎండల రోజులు
కళ్ళు మూసి తెరిచే లోగా..
