ప్రేమ
ప్రేమ
మాటలలో చెప్పలేని..హృదయభాష ప్రేమ..!
మాతృత్వం పరిమళించు..వేదభాష ప్రేమ..!
శ్వాసలలో పొంగుతున్న..ఆరాధన గీతి..
నవసరాగ మాలికయే..పూలభాష ప్రేమ..!
ఎంతమధుర వేదనయో..మరిగేప్రతి మదిని..
ఓదార్పుగ అందుతున్న..కలలభాష ప్రేమ..!
మనసుపడే యాతనలకు..అనువాద మేదో..
తెలుపరాని ఆవేదన..వరదభాష ప్రేమ..!
ప్రతికణమున దాగియున్న..లోకాలను చూపు..
అంతరంగ ఘోషమాన్పు..మౌనభాష ప్రేమ..!
అనురాగపు కోవెలగా..ఈ జగమును నిలిపె..
ఆత్మీయత పంచుతున్న..అమృతభాష ప్రేమ..!

