ప్రేమ వనం
ప్రేమ వనం
పలికెదనే పదేపదే..తెలుగుదనపు గొప్పతనం..!
పాడగలను పరవశాన..తెలుగుభాష తియ్యదనం..!
'అ,ఆ'లతో అ'శేషమౌ..ఆ'నందపు అ'లౌకికత..
అ'మోఘమౌ అ'పురూపత..చాటేనా అ'మ్మతనం..!
అ'మృతమేదొ అ'మరమేదొ..ఆ'వుపాలకే సొంతం..
అ'మేయమౌ అ'ద్వితీయ..అ'చంచల స్నేహధనం..!
అ'గణితమౌ అ'వగాహన..ఆ'లోచన పండించునె..
అ'నురాగం అ'భిమానం..అ'జరామర నాదవనం..!
అ'లలకడలి అ'ఖిలజగతి..అ'నంతమే తనసొంతం..
అ'వినాశిని అ'విభాజ్యరొ..అ'ప్రేమేయ మౌనవనం..!
అ'డ్డులేదు అ'సలు ప్రగతి..అ'నంతమే తెలుగుతోనె..
అ'మలచరిత అ'సామాన్య..ఆ'ధ్యాత్మిక హరితవనం..!
అ'విశ్రాంత అ'కలంకిత..ఆ'రోగ్యపు వరదాయిని..
అ'డుగకనే అ'నుగ్రహం..ప్రసాదించు ప్రేమవనం..!

