ప్రేమ తో జీవులు
ప్రేమ తో జీవులు
ఇల చెట్లు చూడగా..సాక్షాత్తు మునులేను..!
ప్రేమతో జీవులను..రక్షించు ఋషులేను..!
గాలినిడు నీడనిడు..ప్రాణాలు నిలబెట్టు..
ప్రతినెంత బూనెనే..ఈ పుడమి చెలులేను..!
పచ్చదనమే పెంచి..పోషించు గుణమతులు..
కాలుష్యమది కాల్చు..కరుణలో ఘనులేను..!
తూఫాను లొచ్చినా..మేనులే విరిగినా..
సంకల్ప బలముతో..ఫలములిడు సఖులేను..!
కర్మఫల త్యాగులే..తిరుగేమి కోరవే..
కృతజ్ఞతగా బ్రతుకు..ఎఱుకయను ధనులేను..!
నరికినా కాల్చినా..మారాడ వేవేళ..
మేఘులకు జలమిడగ..తపియించు మతులేను..!
