STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రేమ పక్షీ

ప్రేమ పక్షీ

1 min
6



అక్షరాల రెక్కలపై..వాలినదో ప్రేమపక్షి..! 
తనవేదన నివేదనగ..చేసినదో ప్రేమపక్షి..! 

నిజచెలిమికి చోటిచ్చే..మదినెఱిగిన బుజ్జికన్న.. 
చెప్పకనే తనమనస్సు..చెప్పినదో ప్రేమపక్షి..! 

అమ్మతనం ప్రవహించే..నదీహృదయ తీరమదే.. 
ప్రకృతిపరిరక్షణ కవిత..పలికినదో ప్రేమపక్షి..! 

కర్తవ్యం గుర్తెరిగిన..కర్మవీరు నాశ్రయించె.. 
కనులలోకి కనులుకలిపి..చూసినదో ప్రేమపక్షి..! 

కమ్మనైన పాటవంటి..వాక్యబ్రహ్మ గుండెతడిని.. 
కాపాడే లయసాక్షిగ..నిలచినదో ప్రేమపక్షి..! 

సరిహద్దుల పోరులెల్ల..నిలుపుదారి చూపమంటు.. 
విశ్వమైత్రి మేఘుని దరి..చేరినదో ప్రేమపక్షి..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics