ప్రేమ మల్లె
ప్రేమ మల్లె
గుండెచాటు ప్రేమమల్లె..పూస్తూనే ఉంది..!
నీకోసం మనసు ఎదురు చూస్తూనే ఉంది..!
వలపంటే వెంటాడే..ఆవేదన చూడు..
పెదవిచాటు అనురాగం..కోస్తూనే ఉంది..!
నీ చూపుల దారంతో..అల్లుకోవదేల..
తనువేదో మధురంగా..మోస్తూనే ఉంది..!
పరికించే పనికన్నా..అద్భుతమది ఏది..
నీ తలపుల సడి అలజడి..చేస్తూనే ఉంది..!
కనుపాపల తడిమాటున..వింతజలధు లెన్నొ..
రెప్పలపై ఆకాశం..కాస్తూనే ఉంది..!

