ప్రేమ లేఖతో
ప్రేమ లేఖతో
నీ చూపులలో ఎన్ని రాయలేని ప్రేమలేఖలో..!!
నీ పలుకుల్లో ఎన్ని తీయని మకరందాలో..!!
ఓ కలువ కనుల సుందరి..!!
నీ నవ్వులే మల్లెల జలపాతాలా..!!
నీ మాటలే తేనియల మూటలా..!!
ఓ వాలు కళ్ళ వయ్యారి..!!
నీ ఊహలలో నవ పారిజాతాలు విరిసెనా..!!
నీ మది తలపులలో పూల జల్లు కురిసెనా..!!
ఓ పంకజాక్షి..!!
నీ పరిచయం ఎన్నో జన్మల వరం..!!
నీ ప్రేమ గత జన్మల ఫలం.....!!!!!!

