ప్రేమ లేఖ
ప్రేమ లేఖ
నీకోసం వ్రాసుకున్న..లేఖలన్ని భద్రములే..!
నీకుగాక మరియెవరికి..ఆచోటే తెలియదులే..!
ఎంతగొప్ప సుగంధాలు..చిమ్మేనో నాకోసం..
పరిమళించు సంపెంగల..అమాయికత చిత్రములే..!
ఏదినిన్ను ఎలాచేరునో ఏమో ఏంచెప్పను..
ఏహరిత పత్రంపై..అవి వ్రాయబడలేదులే..!
కాలమనే కాగితాన..చెక్కేందుకు రావు నిజం..
మల్లెపూల రెక్కలపై..పొదిగి దాచ లొంగవులే..!
తిరిగితిరిగి కన్నీటితొ..కడుగుతూనె ఉంటాకద..
అభావప్రియ హృదయానువాద భావ సుమాలులే..!
ఏకనులకు కనిపించని..ప్రణయపుష్ప గుచ్ఛాలే..
అమృతకాంతి వనసీమా..మౌనాక్షర మాలలులే..!

