STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ప్రేమ లేఖ పంపేవా

ప్రేమ లేఖ పంపేవా

1 min
4


ప్రేమలేఖ పంపేవా..నిలువలేను పంపకు..! 

చూపుకాస్త మరిచేవా..ఆడలేను మరువకు..! 


ప్రేమలేక శాసించే..అధికారము ఉందా.. 

తలపువీణ మీటేవా..ఆగలేను మీటకు..! 


గతమేదో భవితేదో..ఈక్షణమే చాలును.. 

ఊపిరింట నవ్వేవా..మోయలేను నవ్వకు..! 


వెన్నెలెంత తుంటరిదో..కన్నులింటి నొదలదు.. 

తలనుఅలా నిమిరేవా..ఉండలేను నిమరకు..! 


రాగమేదొ గీతమేదొ..స్వరములేవొ దేనికి.. 

మనసుపట్టి పిండేవా..పాడలేను పిండకు..! 


ప్రవహించే వేనవేల..పాలనదులు లోలో..

మరిగించగ చూసేవా..మరగలేను చూడకు..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance