STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ భావం

ప్రేమ భావం

1 min
3


ఎందుకో నిన్నుఅలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది..!!


మనసును ఎంత అదుపులో పెట్టుకొని కళ్ళు తిప్పేసు కుందామన్నా..!!


మళ్ళీ మళ్ళీ నీవైపుకే తిరుగుతూ

పండుగ సంబరాన్ని సంతరించుకుని

హడావిడి పడుతున్నాయి

 నా కళ్ళు.....!!


చిరుగాలికి ఊగే లేలేతరెమ్మలా ఉండే నువు..!!


చప్పుడు చేయక మెత్తగా తాకే విరులవంటి నీ మృదు మందహాసం..!!


మువ్వల సవ్వడి తోడై సైగ 

చేసే నీ పచ్చని పాదాలు..!!


పాలు పసుపు కొమ్ము రంగరించి

ప్రాణం పోసిన బొమ్మలా నువ్వు

కలయదిరుగుతుంటే..!!


నాలో పొంగుతుంది అంతులేని ప్రేమ భావం..!!


వెన్నెల్లో విరిసిన కలువరేకులల్లే

నీ నయనాలు కాంతిని విరజిమ్ముతుంటే..!!


నీ పెదవంచున చిరునవ్వులు పౌర్ణమి వెన్నెలని తలపిస్తుంటే..!!


పగటిపూట చీకటిని తలపించే నీ నల్లని కురులలో తురుముకున్న గుండు మల్లేలకెంత పొగరు

గుబాలించే పరిమళాన్ని నా పై విసురుతోంది..!!


పరిమళ్ళాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంలో  ఆహా ఎన్నేన్నీ సొబగులో(సొగసులో)..!!

అంటూ కూనిరాగం తీస్తూ మైమరచి పోతోంది నా మది.....!!!!!


          


Rate this content
Log in

Similar telugu poem from Romance