STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ బాషా...

ప్రేమ బాషా...

1 min
249

కన్నుల ప్రేమ భాష వెన్నెల హాయి నిష

మిన్నులనంటే నా ఎద ఘోష వినపడుతుందా బాద్ష...

వేచివేచి కన్నుల నీరింకిపోయే వెక్కివెక్కి గుండెలు బరవయ్యిపోయే

చూసిచూసి హృదయం శిలగా మారిపోయే వలచివగచి పొరపాటు చేసి మారాలంటే వీలే లేకపోయే...

నీకంటికి రెప్పలా గుండెకు శ్వాసలా మనసుకు మధువులా తనువుకి హాయిలా

తలపుకి తపనలా నిదురకి జోలలా మెలకువకి వేకువ పిలుపులా

నిన్ను నాలా ఆరాధించే జీవిcనిన్ను నాలా ప్రేమించే ప్రాణి

వేరెక్కడ దొరుకుతారు చెప్పు...

నేను నేనుగా లేనిప్పుడు నిను చూచిన క్షణమే నీవైపోయినాను

నిన్ను ఒంటరిని కానీనెప్పుడు నన్నెప్పుడో నీకర్పణ చేసేసినాను...

చిటపట చినుకుల రాగం తటపటలన్నీ మాయం చిరుచిందేసే ప్రాయం

అలుపే లేనిదీ హృదయం రెప్పలదుప్పటి కప్పేనే ఈ సమయం

హాయి కదా ఈ ఆనందం...

ప్రేమను తెలుప పొగడక్కరలేదు అభిమానం చెప్ప భాష అవసరంలేదు

ఆపేక్ష చూప అడ్డంటూలేదు

నమ్మకమనే దన్ను తప్ప వేరే భరోసా ఇవ్వక్కరలేదు..


‌.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance