ఎల్ నినో
ఎల్ నినో
ప్రియమైన'ఎల్ నినో'..నీళ్ళిన్ని కరుణించు..!
మనవి విని ఈ భువిని..జీవులను రక్షించు..!
నీవెందు కొస్తావొ..తెలిసింది ఎవరికో..
సమతుల్యతను నిలుప..పనితనం చూపించు..!
డబ్బువెంట పరుగే.. జ్ఞానోదయం ఎపుడొ..
బతుకు విలువను తెలుపు..పాఠాలు నేర్పించు..!
శోధనలు సాధనలు..మనిషెన్ని చేయునో..
గొప్పలకు పోయేను..సత్యమును వివరించు..!
ప్రేమ విలువెరుగకే..అహముతో ఎగిరేను..
విర్రవీగే మనిషిని..నిలిపింత వెలిగించు..!
మసిలేని మతమేదొ..ఎన్నెన్ని ముసుగులో..
తెఱలైన పొరలైన..మొదలంట వదిలించు..!
