మధురమే
మధురమే
ప్రేమించు సంగతిని..దాచడం మధురమే..!
తలుపులింట్లో చేరి..ఆగడం మధురమే..!
పసిడిపూవుల జల్లు..నీ నవ్వు చిత్రమే..
కలలోన కురిపించి..వెళ్ళడం మధురమే..!
నేనెక్క డున్నాను..మైమరపు సీమలో..
నీ వెంట లోకాలు..చుట్టడం మధురమే..!
మన కథకు రూపమది..ఇవ్వాలి ఎందుకట..
ఊహలో హాయిగా..బ్రతకడం మధురమే..!
రాగాల కోవెలగ..ఉన్నావు నాలోన..
నీ చూపు పాటలో..నిండడం మధురమే..!
హేమంత శిశిరాల..ముచ్చట్ల కేమిలే..
వాసంతమై నీవు..పూయడం మధురమే..!
