STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అందనంది

అందనంది

1 min
10



కలం గుండె పగిలింది..నా పాటకు అందనంది..!
చీకటి పురి విప్పింది..నా పాటకు అందనంది..!

ఉచితాలకు ఆరాటం..పరుగుకు అర్థం ఏమిటి..
ఆశరెక్క విరిగింది..నా పాటకు అందనంది..!

మనసు తడిని కోల్పోతే..మనిషితనం మాటేమిటి..
ప్రేమగొంతు నలిగింది..నా పాటకు అందనంది..!

ఉనికిలేని మరణంతో..పోరాటం ఈ నాటకం..
చినుకు కథగ మారింది..నా పాటకు అందనంది..!

నాటరాగ మాధుర్యం..ఎలా ఆవిరవుతోందో..
అమ్మతనం అలిగింది..నా పాటకు అందనంది..!

గతం ఎంత విచిత్రమో..జ్ఞాపకాల వనమేగా..
తీపి బాధ రగిలింది..నా పాటకు అందనంది..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics