చెలి
చెలి
నిత్యమైన హరివిల్లుల..పుష్పవల్లి దసరా చెలి..!
ప్రాణికోటి మూలమైన..ప్రేమవల్లి దసరా చెలి..!
"విజయదశమి" శోభలెల్ల..నింపుకున్న హర్షవల్లి..
సరదాలకు తెఱ తీసే..సరసవల్లి దసరా చెలి..!
పరిమళించు గాలులతో..అలరించే గంధవల్లి..
సంబరాల స్నేహవల్లి..వేదవల్లి దసరా చెలి..!
పాడిపంటలెల్ల కాచు..పావనకర దుర్గాంబిక..
జగములనే పాలించే..అమృతవల్లి దసరా చెలి..!
దివ్యశక్తి తేజోనిధి..ధ్యానామృత నాదవల్లి..
సప్తచక్ర సంచారిణి..నాగవల్లి దసరా చెలి..!
కాలానికి సాక్షియైన..కల్పవల్లి కాత్యాయని..
పరంజ్యోతి రూపవల్లి..మౌనవల్లి దసరా చెలి..!
