పలుకు పలుకులోన నువ్వు విరితేనియ చందమే
విరులు విరులలోన నువ్వు పారిజాత పుష్పమే
మెలమెల్లగ వేణవులో ఊపిరినీ నింపుతావు
పరులొప్పగ కీర్తనలో పెనిమటినీ పలుకుతావు
చంద్రునిలా హిమవంతము నీచల్లని చూపులూ
సూర్యునిలా వెచ్చబరచు నీమోహపు సరిగమలు
ఆకాశం చూచునీకు భూమివిషయ మెరుకయా
నేలమీద ఉన్నానూ నీజతనూ కోరుతూ
నీగానము విన్నానూ చరణదాసి చిన్మయీ
నీరాగము నాయెదలో రమియించెను రాగిణీ
నీతాళము నాయొడలా కదిలించెను భామినీ
నీపల్లవి నామదిలో కురిపించెను ప్రేమనీ
నాతోడూ నీడవయీ దిగివచ్చిన కాదంబరి
ననుమెచ్చీ క్షుద్భాదను పోగొట్టే శాకంబరి
కనుసన్నల ఆజ్ఞలిచ్చి పాలించే ప్రమోదినీ
అనునిత్యము శ్రేయమిచ్చు నాపాలిట కాత్యాయని