STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

వచ్చింది

వచ్చింది

1 min
5


అలుకెందు కని నీవు..అడగడం నచ్చింది..!
తీర్చ నువు 'టీ'చేసి..తేవడం నచ్చింది..!

కనులెత్తకుండ నే..గమనిస్తు ఉన్నాను..
బుద్ధిగా పాదాలు..నొక్కడం నచ్చింది..!

మారాము చేయనని..అంటావు గోముగా..
మల్లెచెండుగ శిగన..చేరడం నచ్చింది..!

తాపమున నా మనసు..ఉడుకుతూ మరిగితే..
నువు చెలిమి మేఘమై..కురవడం నచ్చింది..!

కలలేమి కనవలెను..ఉన్నదే కల కదా..
సత్యమే ఎఱుకలో..ఉండడం నచ్చింది..!

బతుకెంత చిత్రమో..అందదీ మాటలకు..
చూడగా మాయతెఱ..తొలగడం నచ్చింది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics