STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కనులు ఆనందం

కనులు ఆనందం

1 min
8


కనులు ఆనంద నందనాలు ఆశ్రితమే
ఎదర దరహాస ప్రచోదనం ఆశుగమే 
ఇసుమంత మంతనాలు సేతు ఆగమించు
సరితూచి తూచినంత కూడి ఆదరించు 

నీకరపల్లవము సోకినంత కీటకాలు
నీమహిమవలనను మేనిరంగు వివర్ణమై
సువర్ణవర్ణమును పొందినాయి విస్మయమే
మేరువు మానసపు పుత్రికవా రంజనివా 

నీకను సైగలా పాటించుచు విహంగాలు
నీకును వివశమై మకరందం మాటమరచి
నీపరి భ్రమణములు చేయుచుండ అబ్బురమే
విష్ణువు మాయలను నేర్చితివా మోహినివా 

సూర్యుని కాంతిపడి వెలుగునటా చందమామ
చందమామ వెన్నెలలు కురియునటా పున్నమందు
పున్నమందు పుష్కరిణి విరియునటా కలువపూవు
కలువపూవు నామనసు దోచెనటా నీవనగా 

                               


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics