STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రేమతో

ప్రేమతో

1 min
4


నిజస్నేహ గీతమై..పొంగనీ ప్రేమతో..!
గురుశాంతి దీపమై..ఉండనీ ప్రేమతో..!

ఈ నేను నీ భిక్ష..మరి ఏమి కాదులే..
సమభావ కలశమై..మిగలనీ ప్రేమతో..!

ఎవరితో సమరమో..ఎందుకీ జన్మమో..
పెనుమాయ సాక్ష్యమై..నిలువనీ ప్రేమతో..!

ప్రశ్నించు మనసుతో..పోరాట మేమిటో..
నిజప్రణయ రాగమై..సాగనీ ప్రేమతో..!

చరితలో కథలెన్నొ..నా కథయె చిత్రమే..
నిజనాట్య శిల్పమై..ఆడనీ ప్రేమతో..!

నీవెచట ఉన్నావొ..వేదనే నివేదన..
ఓ చిన్ని పుష్పమై..రాలనీ ప్రేమతో ..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics