మనోరవం
మనోరవం
తనువుతాక తుషారమే తరుణిమనసు తపించెనే
మనోహరం మనోజవం మనోహితం మనోరవం
మనసుతలుపు తెరిచిందీ వలపుపిలుపు వినిపించీ
తలపుగడియ తీసిందీ వరునికొరకు నిలిచిందీ
నిమీళిత నేత్రద్వయ సమ్మిళిత సమ్మోహన నేత్రి
విచ్చుకున్న అధరపుటము విన్నవించు చెలునిచెంత
విరబూసిన గులాబీల పరిమళమే నా ప్రేమా
విహితరాగ అనువర్తన ఆలాపన నా గానం
పరవశాన పులకరించు నాదేహము నీవశమై
మైమరచే నాప్రాణము నీపలుకుల రమ్యతతో
మనసుపడీ మనువాడగ అరుదెంచితి వనమాలీ
చేకొనరా పరిణయాన నాకరమును కరుణమాల
ఆనంద తాండవం చేస్తోంది నామనసూ
ఆనంద నందనం ఔతోంది నా యిల్లని
నామనసు కోవెలా రంజిలా నీ పేరున
నాకొరకు విచ్చేయు వసంతుడ వీవేయని
