ప్రేమ అసంకల్పితం
ప్రేమ అసంకల్పితం
అనుకోకుండా
ఆమె కనబడగానే
అరుపొకటి అదుపు తప్పి బయటపడుతుంది.
"అబ్బా! ఏంటా అరుపులు_?!"
అంటూ తీయని విసుగూ.
తనకెలా చెప్పాలి,
ప్రేమ అసంకల్పితమనీ_
ఏమీ అనుకోకుండానే
ప్రేమిస్తున్నాననీ_
అయినా,
కోయలేని పండు
రాలి చేతిలో పడితే,
అరుపు రాని ఆనందం ఎందుకూ!?
నాలో కట్టేసున్న చిన్నపిల్లాడి
కట్లు తెంచి ఎగిరించి
అరిపించి మురిపించే
మాయ తనది.

