STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రాణం తీసే ప్రాణ స్నేహం

ప్రాణం తీసే ప్రాణ స్నేహం

1 min
15

ప్రాణం తీసే ప్రాణ స్నేహం
కొందరు ఉంటారు..
మనం పంపే మెసేజ్ చూస్తారు, మన ఆవేదన చదువుతారు..
కానీ, చచ్చిన మనిషికి జవాబివ్వనట్లు మౌనంగా ఉండిపోతారు!
ఆ క్షణం మన గుండెల్లో మొదలయ్యేది కోపం కాదు.. ఒక రకమైన శూన్యం!
బిజీగా ఉన్నాననేది ఒక సాకు మాత్రమే,
మనం వద్దనుకున్నప్పుడు ప్రపంచమంతా ఖాళీగానే కనిపిస్తుంది.
అవసరం ఉన్నప్పుడు అరికాళ్లకు మడుగులొత్తిన వాళ్లే,
నువ్వు పైకి ఎదుగుతుంటే నీ కాళ్లు పట్టుకుని లాగుతుంటారు.
"నీకు నేనున్నాను" అని చెప్పిన ఆ రోజే,
నిన్ను ఒంటరిని చేసే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటారు!
ముందుండి నడిపిస్తారని నమ్మితే..
మునుగడ లేకుండా వెన్నుపోటు పొడుస్తారు.
నమ్మకద్రోహం అంటే కేవలం మోసం చేయడం కాదు..
మరో మనిషిని నమ్మలేనంతగా ఒకరి మనసును చంపేయడం!
నువ్వు రక్త కన్నీరు పెడుతుంటే..
వారు మాత్రం నీ బాధను ఒక తమాషాగా చూస్తుంటారు.
నీ ఎదుగుదల చూసి ఓర్వలేక వాళ్ళు తొక్కేయాలని చూస్తున్నారంటే..
నువ్వు వాళ్లకంటే చాలా ఎత్తులో ఉన్నావని అర్థం!
రాయి విసిరిన ప్రతివాడికి సమాధానం చెప్పనక్కర్లేదు..
నీ మౌనమే వాళ్లకు అతిపెద్ద శిక్ష కావాలి.


Rate this content
Log in

Similar telugu poem from Classics