పోస్టు చేయని ఉత్తరం
పోస్టు చేయని ఉత్తరం


ప౹౹
రాశా రాశా నేనూ ఒక చిత్రమైన ఉత్తరం
వేచావేచా తిరిగి వస్తుందని ప్రత్యుత్తరం ౹2౹
చ౹౹
ఎదలోని భావాలు ఏకబిగీన రాయాలని
ఏదోఏదో రాశానే సరికొత్తగ తెలియాలని ౹2౹
మనసులో యోచనలు బాగా రంగరించి
ధనసులాగ ఎక్కుపెట్టానే చాల వివరించి ౹ప౹
చ౹౹
కలకలమే సృష్టించాలని కలలోకూడాను
కలకాలం గుర్తుండాలని విడవకుండాను ౹2౹
భాషలోని ప్రాసనే వాడానే గుర్తుండాలని
తమాషగ అనుప్రాసే రాశా బాగుండాలని ౹ప౹
చ౹౹
ఇకఎదురే చూసా తన జవాబు కోసమని
ఆనకచూసా ఏమిచేస్తుందో పరిహాసమని ౹2౹
కొన్ని రోజుల తరువాత..
లేఖఅక్కడే ఉండటంచూసా తడబాటున
అరరే...
మరిచాను పోస్టు చేయనూ పొరపాటున ౹ప౹